తనికెళ్ళ భరణి సిద్ధం చేసుకున్న ‘భక్తకన్నప్ప’ కథతో సినిమా చేయాలనుకున్నాడు. అయితే ఈ స్క్రిప్ట్ పలు చేతులు మారింది. ఫైనల్ గా మోహన్ బాబు కథ మాకు ఇవ్వండి.. మేము వేరే డైరెక్టర్ తో సినిమా చేస్తామని చెప్పగానే తనికెళ్ళభరణి మంచు ఫ్యామిలీకి కథ అందించినట్లు తెలుస్తోంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అంతర్జాతీయ విలువలతో రూపొందించాలనేది మోహన్ బాబు ప్లాన్. అయితే ఇప్పుడు ఈ కథను మోహన్ బాబు రచయిత సాయి మాధవ్ బుర్రా చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. పదునైన సంభాషణలను అందించడంలో ధిట్ట అయిన సాయి మాధవ్ ఈ చిత్రానికి కూడా కొన్ని సన్నివేశాలను రాయబోతున్నారు.
గతంలో ఆయన సంభాషణలు అందించిన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చిత్రాలు ప్రత్యేకంగా
నిలిచాయి. ఇప్పుడు మరోసారి బుర్రా ఆయన కలానికి పదును పెట్టబోతున్నాడు. 2018నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాకు మోహన్ బాబు దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తారని చెబుతున్నారు. ఇప్పటివరకు నటుడిగా, నిర్మాతగా తన ప్రతిభ చాటిన మోహన్ బాబు ఈ సినిమాతో దర్శకుడిగా కూడా తన టాలెంట్ ను నిరూపిస్తాడేమో.. చూడాలి!