ఈ మధ్య కాలంలో రైటర్ సాయి మాధవ్ బుర్రా బాగా ఫేమస్ అయ్యారు. సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలకు డైలాగ్స్ అందించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేశాడు ఈ రైటర్. అయితే ఇప్పుడు ఈ రచయిత పవన్ సినిమా కోసం పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా బుర్రా, పవన్ నటించిన ‘గోపాల గోపాల’ సినిమాకు మాటలు అందించారు. ఇప్పుడు పవన్, డాలీ కాంబినేషన్ లో వస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమా కోసం సాయి మాధవ్ బుర్రా ప్రత్యేకంగా కొన్ని డైలాగ్స్ తో కూడిన సన్నివేశాలు రాయబోతున్నారు.
మాస్ ఆడియన్స్ కు నచ్చే విధంగా ఈ డైలాగ్స్ ఉండబోతున్నాయని చెబుతున్నారు. చిత్రబృందం కూడా సినిమాకు ఈ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని నమ్ముతున్నారు. దీనికోసం కథలో కొన్ని మార్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే బుర్రా రాసిన సీన్స్ ను చిత్రీకరించనున్నారు. మరి ఈ సినిమాతో మరోసారి సాయి మాధవ్ బుర్రా హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి!