నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమా ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ చిత్ర నిర్మాత సాయి కొర్రపాటికి, బాలయ్యకు మధ్య మంచి అనుబంధం ఉంది. నందమూరి మరో వారసుడు మోక్షజ్ఞ డెబ్యు ఫిల్మ్ కూడా సాయి కొర్రపాటి చేతుల్లోనే ఉంది. అంతగా బాలయ్య, సాయి కొర్రపాటిని నమ్ముతాడు. తాజాగా ఆయన బాలయ్య ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా సంక్రాంతి బరిలో దిగనుంది.
ముందుగా ఈ సినిమా వైజాగ్, సీడెడ్ హక్కులను తనే తీసుకుంటానని చెప్పిన సాయి కొర్రపాటి ఇప్పుడు మాత్రం వెనుకడుగు వేస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న కరెన్సీ సమస్య వలన అంత మొత్తం చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న కొర్రపాటి ఆ విషయాన్ని ముందుగా బాలకృష్ణకు చెప్పారట. నిజంగానే డబ్బు సమస్యో.. లేక సినిమాను అంత డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం లేదనుకున్నారో..? ఆయనకే తెలియాలి!