HomeTelugu Trendingసినిమాలకు బ్రేక్ చెప్పిన సాయిధరమ్ తేజ్

సినిమాలకు బ్రేక్ చెప్పిన సాయిధరమ్ తేజ్

Sai Tej break

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినిమాల నుంచి మరోసారి గ్యాప్ తీసుకోబోతున్నాడు. ఆరు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్టు సాయి తేజ్ ప్రకటించాడు. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత సాజి తేజ్‌ 2 సినిమాల్లో నటించాడు. రీఎంట్రీ తర్వాత వచ్చిన ‘విరూపాక్ష’ ఘన విజయం సాధించింది. రీసెంట్‌గా పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన ‘బ్రో’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రమాదం నుంచి కోలుకున్నప్పటికీ ఇంకా సాయితేజ్ ఇబ్బంది పడుతున్నాడు. అందుకే సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను ఓ చిన్న సర్జరీ చేయించుకోవాల్సి ఉందని తెలిపాడు. సర్జరీ తర్వాత మరింత బలంగా, పూర్తి ఫిట్‌నెస్‌తో రానున్నట్టు తెలిపాడు.

బ్రో సినిమా ప్రమోషన్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సాయితేజ్ ఈవిషయాన్ని వెల్లడించారు. బ్రో సినిమా తాను 21 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నట్టు తెలిపారు. సర్జరీ కారణంగా కొత్తగా సినిమా కథలను కూడా వినలేదని అన్నాడు. బ్రేక్ తర్వాత దర్శకుడు సంపత్ నంది సినిమాలో నటిస్తానని వెల్లడించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu