మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తాను కూడా పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సిగ్నల్ ఇచ్చేశారు సాయి ధరమ్. “ఒక్కోసారి మనం ఎన్నో అనుకుంటాం కానీ, ఆ టైం వచ్చినప్పుడు తప్పదు మరి అని చెప్పుకొస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో బ్యాచిలర్ హీరోలందరూ కలిసి ఉన్న ‘సింగిల్ ఆర్మీ’ అనే వాట్సాప్ గ్రూప్ నుంచి నిఖిల్, నితిన్, రానా.. ఇలా ఒక్కొక్కరు లెఫ్ట్ అయ్యారు. చివర్లో “ప్రభాస్ అన్నా.. సారీ, ఇప్పుడు నా వంతు వచ్చిందం”టూ సుప్రీం హీరో కూడా లెఫ్ట్ అయ్యారు. దీంతో ఆయన కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని నెటిజన్లు అంటున్నారు. అయితే ఈ విషయం గురించి పూర్తి క్లారిటీ రావాలంటే రేపు ఉదయం 10 గంటల వరకు వేచి ఉండాల్సిందే. కాగా త్వరలోనే మెగా డాటర్ నిహారిక కూడా వివాహాం చేసుకోబోతున్నారు. తాజాగా జొన్నలగడ్డ చైతన్యతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
ఒక్కో సారి మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ టైం వచ్చినప్పుడు మరి….
More details tomorrow at 10AM pic.twitter.com/5PJZIPuVJu
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 23, 2020