విజయవాడలోని ‘అమ్మ ప్రేమ ఆదరణ సేవ’ భవనం మరమ్మతులు, వసతుల విషయంలో గతంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన మాటను నిలబెట్టకున్నాడు. భవనానికి మరమ్మతులు చేయించాడు. 2019లో తన పుట్టినరోజు సందర్భంగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేసి, ఆ వృద్ధాశ్రమం నిర్వాహకులు తనను సంప్రదించి, భవన నిర్మాణానికి సాయం చేయాల్సిందిగా కోరారని, అందుకు తాను అంగీకరించానని తెలిపాడు. ఈ కార్యక్రమానికి మెగా అభిమానులు కూడా కొంత సాయం చేశారు. చివరకు సాయితేజ్ ఆ భవన నిర్మాణం పూర్తి చేయించాడు.
దానికి సంబంధించిన ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి. అంతేకాకుండా ఇపుడు పూరై ఈ వృద్ధాశ్రమానికి ఒక సంవత్సరం పాటు ఆర్ధికంగా అండగా నిలుస్తానని తేజ్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం వారికి అండగా నిలబడినందుకు మెగా మేనల్లుడికి అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.