మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సాయి థరమ్ తేజ్ సుప్రీం హీరో పేరు తెచ్చుకున్నాడు. ఆయన తాజాగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుండి తాజాగా ‘నో పెళ్లి’ సాంగ్ విడుదలై.. సోషల్ మీడిమాలో వైరల్ గా మారింది. తాజాగా ఆయన తన పెళ్లి విషయంలో అమ్మకు.. ప్రతి రోజూ ఏదో ఒక గొడవ జరుగుతోందని అంటున్నాడు. అయితే ఇప్పట్లో పెళ్లి మాత్రం చేసుకోనంటున్నాడు ఈ హీరో. రెండేళ్ల వరకు పెళ్లి వద్దని.. మరో రెండేళ్లు టైమ్ కావాలంటూ మెల్లగా అమ్మను ఒప్పించాను అని తెలిపాడు. ఈ విషయం పై ఇంట్లో చర్చ నడుస్తుంది అని.. అయితే నాకు టైమ్ ఇస్తారో లేని అనేది చూడాలి అని తెలిపాడు. అయితే ఇప్పటి వరుకు తన మనసుకు నచ్చిన అమ్మాయి దొరకలేదన్నాడు. ఒకవేళ అటువంటి అమ్మాయి దొరికినా తనను అర్థం చేసుకోవడానికి టైమ్ పడుతుంది అని చెప్పాడు. మరీ చూడాలి ఎమౌతుందో..