HomeTelugu Trendingనా డ్యాన్స్‌ చూసి అభిమానులే కాదు.. నేనూ నిరాశపడ్డా: సాయి ధరమ్‌ తేజ్‌

నా డ్యాన్స్‌ చూసి అభిమానులే కాదు.. నేనూ నిరాశపడ్డా: సాయి ధరమ్‌ తేజ్‌

Sai Dharam Tej comments on
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తరువాత నటించిన చిత్రం ‘విరూపాక్ష’. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆయన తాజా నటిస్తున్న చిత్రం ‘బ్రో’. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 28న విడుదల కానున్న ఈ చిత్రంలో పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవలే సినిమా నుండి విడుదలైన ఓ పాటలో తేజ్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌ గతంలో ఉన్నంతగా లేవని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ కామెంట్స్ పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధరమ్ తేజ్ స్పందించాడు. యాక్సిడెంట్ తర్వాత ట్రీట్మెంట్, మెడిసిన్స్ వల్ల శరీరంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పాడు. తన డ్యాన్స్ ను చూసి అభిమానులే కాకుండా తాను కూడా నిరాశపడ్డానని తెలిపాడు. బాడీలో ఫిజికల్ మూమెంట్స్ కు కొన్ని సమస్యలు ఉన్నాయని వెల్లడించాడు. గతంలో కంటే కూడా బెటర్ గా డ్యాన్స్ చేయగలనని, అయితే దీనికి కొంత సమయం పడుతుందని చెప్పాడు.

యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు కనీసం మాట్లాడలేకపోయానని… ఆ సమస్యను అధిగమించానని తేజూ చెప్పాడు. తాను కోమాలో ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ ఇచ్చారని… అవి తన శరీరంపై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపాడు. ఫిట్ నెస్ ను మళ్లీ సాధించాల్సి ఉందని… ప్రస్తుతం ఆ పని పైనే ఉన్నానని చెప్పాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu