పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘బ్రో’ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే . ఈ సినిమాలో పృథ్వీ చేత వేయించారు. ఇవీ ఏపీ మంత్రి అంబటి రాంబాబుని ఇమిటేట్ చేసిన్నట్లు అని పిస్తుంది. ఈ పాత్రకు సోంబాబు పేరు పెట్టారు. దీనిపై అంబటి విమర్శలు గుప్పించారు.
సంక్రాంతి సందర్భంగా ఆయన స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. టీషర్ట్, ట్రాక్ ప్యాంట్ ధరించి ఆయన వేసిన డ్యాన్స్ అప్పట్లో వైరల్ అయింది. ఈ సినిమా హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్లు కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, నిర్మాత విశ్వప్రసాద్ ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు డ్యాన్స్ ను సినిమాలో పెట్టారనే విషయాన్ని యాంకర్ లేవనెత్తారు.
దీనికి సమాధానంగా అలాంటిది ఏమీ లేదని సాయితేజ్ చెప్పారు. ఆరోజు డ్యాన్స్ చేసిన సందర్భంగా అంబటి వేసుకున్న టీషర్ట్, ప్యాంట్, షూ లాంటివే ఈ సినిమాలో కూడా పృథ్వీ వేసుకున్నారని యాంకర్ తెలిపారు. దీనిపై సాయితేజ్ స్పందిస్తూ… ఇద్దరి హెయిర్ స్టైల్ వేరుగా ఉందని, పృథ్వీకి మీసాలు లేవని చెప్పారు. మరోవైపు అంబటి రాంబాబు గారు చాలా బాగా డ్యాన్స్ చేశారని కితాబునిచ్చారు.