నటి సదా గురించి ప్రత్యేకించి చెప్పనవసం లేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ యూట్యూబ్, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ థియేటర్‌లో కన్నీళ్లు పెట్టుకుంది. తన మనసుకు ఆ సినిమా ఎంతగానో చేరువైందని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకి ఆ సినిమా ఏంటంటే ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్‌గా తెరకెక్కిన ‘మేజర్’. అడవి శేష్ హీరోగా నటించిన ఈ మూవీకి ప్రతి ఒక్కరు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. ఈ విధంగానే తాజాగా ఈ సినిమాని వీక్షించిన సదా ఎమోషనల్ అయింది. ఫస్ట్ ఆఫ్‌లోనే భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక కంటతడి పెట్టుకుంది. ఉగ్రదాడి జరిగిన సమయంలో తను ముంబయిలోనే ఉన్నాని, ఇప్పుడు ఆ మూవీ చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తుకువచ్చాయని తెలిపింది. అంతేకాకుండా కొన్ని సన్నివేశాల్లో రోమాలు నిక్కబొడుచుకున్నాయని పేర్కొంది. శశి కిరణ్ కథను తెరకెక్కించిన విధానం, అడవి శేష్ నటన అద్భుతంగా ఉన్నాయని ప్రశంసిచింది.
https://www.instagram.com/tv/Ce8Bzp-JhK5/?utm_source=ig_web_copy_link