జయం సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సదా ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో ఆమె నటించింది. ప్రస్తుతం సదా వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ టీవీ రియాల్టీ షోలు, డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.
2002లో తెరంగేట్రం చేసిన సదాకు అప్పుడే 39 ఏళ్లు వచ్చేశాయి. కెరీర్ పరంగా ఎప్పుడూ బిజీగా ఉండే సదా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎక్కడకు వెళ్లినా ఆమె పెళ్లి గురించే అందరూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఓ ఇంటర్వ్యూలో సదా తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసింది.
పెళ్లి అంటే తనకు ఆసక్తి లేదని స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే వ్యక్తి తనను అర్థం చేసుకుంటాడో లేదో అని అంటోంది. పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛను కోల్పోతాము. ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడటం లేదు, చిన్న కారణాలతోనే విడిపోతున్నారు అంటూ తన బాధను చెప్పుకొచ్చింది.
పెళ్లి చేసుకోవడం ఎందుకు, విడిపోవడం ఎందుకు అందుకే పెళ్లికి దూరంగా ఉన్నాను అంటోంది. తాను పెళ్లి చేసుకోలేదు కాబట్టే ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్తోంది.