శ్రీలంకకు చెందిన ప్రముఖ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితాధారంగా కోలీవుడ్‌లో ఓ బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రీల్ లైఫ్ మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నారు. శ్రీపతి రంగసామి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అతిథి పాత్రలో కన్పించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. మురళీధరన్, సచిన్‌కు మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరూ మ్యాచ్ ఆడుతున్నప్పుడు జరిగిన ఏదైనా ఓ ఆసక్తికర సంఘటనను సినిమాలో చూపించనున్నారట. అయితే ఈ గుసగుసలపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది. సురేశ్ ప్రొడక్షన్స్, దార్ ఫిలింస్ సంయుక్తంగా సినిమాను నిర్మించనున్నాయి. 2020 నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది.