HomeTelugu Trending800 ట్రైలర్‌ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా సచిన్‌

800 ట్రైలర్‌ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా సచిన్‌

Sachin as a chief guest for

ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, శ్రీలంక లెజెండరీ స్రిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘800’ పేరుతో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటిస్తున్నాడు. సెప్టెంబర్ 5న ముంబైలో ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ హాజరవుతున్నాడు.

ఈ చిత్రాన్ని ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఆలిండియా పంపిణీ హక్కులను శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సచిన్ వస్తుండటం సంతోషంగా ఉందని చెప్పారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu