HomeTelugu Big Stories'ఆదిపురుష్‌' మ్యూజిక్ డైరెక్టర్ వీరేనట!

‘ఆదిపురుష్‌’ మ్యూజిక్ డైరెక్టర్ వీరేనట!

Sachet and Parampara to com

బాలీవుడ్‌ దర్శకుడు ఓమ్‌ రౌత్‌ డైరెక్షన్‌లో టాలీవుడ్‌ హీరో ప్రభాస్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’‌. ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే సీతగా కృతీసన్‌ నటించగా.. రావణుడిగా సైఫ్‌ అలీఖాన్ పాత్రలో అలరించనున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా సాచేత్‌ తాండన్‌- పరంపరా ఠాకూర్‌లు సంతకం చేసినట్లు టాక్‌. ఇప్పటికే వీరు కబీర్‌ సింగ్‌, ఓం రౌత్‌ తెరకెక్కించిన తొలి చిత్రం తాన్హాజీ సినిమాలకు సంగీతం అందించారు.

సంగీత పరంగా ఈ రెండు సినిమాలు మంచి టాక్‌ను తెచ్చుకున్నాయి. దీంతో ఆదిపురుష్‌ కూడా సంగీత అందించే బాధ్యతలను డైరెక్టర్‌ సాచెత్‌, పరంపరాలకు అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్‌ బ్యానర్‌పై భూషన్‌ కుమార్‌-కృష్ణ కుమార్‌-ప్రసాద్‌ సుతార్‌లు నిర్మిస్తున్నారు. భారీ బడ్జేట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ పాన్‌ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఆగష్టు 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu