హిందీ మీడియం సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పాకిస్తానీ నటి సబా కమర్. ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త అజీమ్ ఖాన్‌తో నిశ్చితార్ధం చేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ పెళ్లికి బ్రేకప్ చెప్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇప్పటి వరకు తనను సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు అంటోంది. అజీమ్‌కు సబాతో ఎంగేజ్‌మెంట్ జరిగిన కొన్ని రోజులకే అతనిపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే అజీమ్‌తో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు సబా ప్రకటించారు. సబా పోస్టుపై అజీమ్ ఖాన్ స్పందించారు. ‘సబా.. నువ్వు మంచి మనస్సున్న వ్యక్తివి. ఈ భూమ్మీద ఉన్న సంతోషమంతా నీకు దక్కాలని ఆశిస్తున్నాను. దేవుడు నీకు అన్నివేళలా విజయాన్నే అందించాలని కోరుకుంటున్నా. ముళ్లబాట చివరికి అందమైన గమ్యానికి చేరుస్తుంది. ఈ బ్రేకప్ పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా’ అంటూ రిప్లై ఇచ్చారు.
View this post on Instagram