టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. తాజాగా ఆర్ఎక్స్100 మూవీ నిర్మాత అశోక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ1 దేవరాజ్ రెడ్డి, ఏ2 సాయిరెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో పోలీసులు 17 మంది సాక్షులను విచారించారు. సోమవారం విచారణకు వస్తానని చెప్పిన నిర్మాత అశోక్ రెడ్డిమాత్రం పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఎట్టకేలకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు శ్రావణిని ఏదో ఒక సందర్భంలో పెళ్లి చేసుకుంటామని చెప్పి.. ఆ తర్వాత పలు రకాలుగా ఆమెను వేధించినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. ఈ బాధ భరించలేకే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నట్టు డీసీపీ వెల్లడించారు.