HomeTelugu Trendingనీ కంటే విలువైన వ్యక్తి నా జీవితంలో లేరు... తన ప్రేమకథను షేర్‌ చేసిన పాయల్‌ రాజ్‌ పుత్‌

నీ కంటే విలువైన వ్యక్తి నా జీవితంలో లేరు… తన ప్రేమకథను షేర్‌ చేసిన పాయల్‌ రాజ్‌ పుత్‌

4a 1
టాలీవుడ్‌లో ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కుర్రకారుని ఓ ఊపు ఉపేసిన భామ పాయల్ రాజ్ పుత్. ఈ బ్యూటీ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది. ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను కొన్ని నెలల క్రితమే పాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అతని గురించి అప్పుడు ఎలాంటి వివరాలను వెల్లడించకపోయినా… అతను ఆమె బోయ్ ఫ్రెండ్ అయివుంటాడనే అందరూ భావించారు. ఇప్పుడు అతనితో గడిపిన మరికొన్ని ఫొటోలను షేర్ చేస్తూ… అతనే తన ప్రాణం అని పాయల్ తమ ప్రేమకథను అభిమానులతో పంచుకుంది. పాయల్ ప్రియడి పేరు సౌరభ్ డింగ్రా. అతను ముంబైకి చెందిన మోడల్. చాలా కాలంగా అతనితో పాయల్ డేటింగ్ చేస్తోంది.

ఈ రోజు సౌరభ్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో అతనితో గడిపిన మరికొన్ని ఫొటోలను పాయల్ షేర్ చేసింది. ‘నాలోని లోపాలను కూడా ప్రేమించే ఏకైక వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ కంటే విలువైన వ్యక్తి నా జీవితంలో మరెవరూ లేరు. మనిద్దరం కలిసి గడిపిన ప్రతి క్షణం నాకు మధుర జ్ఞాపకమే’ అని ట్వీట్ చేసింది హాట్ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu