టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, ఆర్ఎస్100 డైరెక్టర్ అజయ్ భూపతి పేర్లతో సోషల్ మీడియాలోసోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తూ యువతను ఆకర్షిస్తున్న వైనం తాజాగా వెలుగుచూసింది. ఆసక్తి ఉన్న వారు ఫొటోలు వీడియో తీసి పంపించాలని.. తాము వాటిని ఎడిట్ చేసి సినిమాలు టీవీ సీరియళ్లలో అవకాశాలు ఇప్పించేలా చేస్తామని.. ఇందు కోసం వేలకు వేలు చెల్లిస్తే సరి పోతుందని ప్రకటనలు చేశారు. ఇక తాజాగా డైరెక్టర్ అజయ్ భూపతి పేరుతో వాట్సాప్ నంబర్ ను సృష్టించి హీరోయిన్ కావాలంటూ ప్రచారం చేస్తున్నారు. ముగ్గురు యువతులు డైరెక్టుగా అజయ్ భూపతిని సంప్రదించగా ఈ మోసం బయట పడింది. ఈ నేపధ్యంలో అజయ్ భూపతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ నకిలీ రాయుళ్ల గురించి పోలీసులు గాలిస్తున్నారు.