బాలీవుడ్ స్టార్ కపుల్ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక.. అమెరికా సింగర్ నిక్ జోనస్ తో రెండు నెలల ప్రేమాయణాన్ని మూడు ముళ్ళతో వివాహ బంధంగా మార్చుకుంది.
2018 లో ఒక్కటైన ఈ జంట ఎక్కడ చూసిన స్పెషల్ ఎట్రాక్షన్ గా మారారు. అయితే తాజా పరిణామాలు చుస్తే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.. మరికొంతమంది వీరిద్దరికి విడాకులు కూడా అయిపోయాయని చెప్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు.. పెళ్లి అయ్యాక ప్రియాంక భర్త పేరు జోనస్ ని తన ఇన్స్టాగ్రామ్ ఐడీలో యాడ్ చేసింది. మొన్నటివరకు ప్రియాంక చోప్రా జోనస్ గా ఉన్న ఆమె ఐడీ.. నిన్న జోనస్ పేరును తొలగించి ప్రియాంక చోప్రాగా మార్చేసింది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నారన్న వార్తలకు ఆజ్యం పోసింది.
ఇటీవల సమంత కూడా విడాకుల ముందు అత్తగారింటి పేరు అక్కినేనిని తొలగించిన విషయం తెల్సిందే.. ప్రస్తుతం ప్రియాంక కూడా అదే పని చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.