బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పెళ్ళికొడుకు కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే అమిర్ తన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈ విడాకులకు కారణం అమీర్ ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్ తో పీకల్లోతు ప్రేమలో మునగడమే అని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకొనునట్లు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘దంగల్’ సినిమాలో అమీర్ కి పెద్ద కూతురిగా నటించిన ఫాతిమా ఆ సినిమా షూటింగ్ లోనే అమీర్ తో ప్రేమలో పడినట్లు సమాచారం. ప్రస్తుతం అమీర్ నటించిన లాల్ సింగ్ చద్దా .. విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమా తర్వాత ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజమున్నదో తెలియాలంటే ఈ జంట స్పదించాల్సిందే.