రూమర్స్ పై పరినీతి రియాక్షన్!
సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి కామన్. ఎందుకంటే గ్లామర్ ప్రపంచం.. అందులోనూ ఒకరితో
ఒకరు బాగా సన్నిహితంగా మెలుగుతుంటారు. ఇంకేముంది గాసిప్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. అలానే
బాలీవుడ్ సుందరి పరినీతి చోప్రాపై కూడా రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. చాలా మంది
నటీనటులు ఈ రూమర్స్ ను పెద్దగా పట్టించుకోరు కానీ పరినీతి మాత్రం తనదైన స్టయిల్ లో
రియాక్ట్ అయింది. అసలు విషయంలోకి వస్తే.. పరినీతికి మనీష్ శర్మ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లతో
అఫైర్స్ ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. ఈ రూమర్స్ పై స్పందించిన ఈ ముద్దుగుమ్మ.. ”నాకు
మనీష్ తో ఆరేళ్లుగా పరిచయం ఉంది. చాలా సార్లు మీడియా ముఖంగా మేము డేటింగ్ లో లేమని
క్లారిటీ ఇచ్చాను. కానీ పట్టించుకోకుండా నేను రోజు.. ఆదిత్య చోప్రా ఆఫీస్ లో మనీష్ క్యాబిన్ కు
వెళ్ళి మరీ ఆయన్ను కలుస్తున్నానని రాశారు. తనకు ఆఫీస్ లో క్యాబిన్ ఎక్కడుందని మనీష్ నన్ను
అడుగుతున్నాడు. అంతేకాదు సుశాంత్ తో కూడా అఫైర్ ఉందని రాశారు. ఒక నైట్ సుశాంత్ తో
గడిపాక నాకు బ్రేకప్ చెప్పి వెళ్లిపోయాడని వార్తలు ప్రచురించారు. అసలు చివరగా ఆయనతో ఎప్పుడు
మాట్లాడానో కూడా నాకు గుర్తులేదు. మీకు నచ్చినట్లు రాసుకుంటూ పోతే మాకు ఇంట్లో ఎలాంటి
సమస్యలు వస్తాయో మీకు తెలుసా.. అంటూ మీడియాను నిలదీసింది.