హీరో విశాల్ బీజేపీలోకి చేరుతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. బీజేపీలో చేరే అంశంపై చర్చించేందుకు ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మురుగన్ అపాయింట్మెంట్ కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాట ఈ ప్రచారం జోరుగా సాగుతుంది. హీరో విశాల్‌కు రాజకీయాలంటే చాలా ఆసక్తి. ఎప్పటికప్పుడు రాష్ట్ర, దేశ రాజకీయాలపై అధ్యయనం చేస్తూ ఉంటారు. గత కొంతకాలంగా విశాల్ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఆర్.కె.నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని విశాల్ భావించాడు. అయితే విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇకపోతే తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో అధ్యక్షుడిగానూ, దక్షిణ భారత ఎన్నికల సంఘంకు కార్యదర్శిగానూ విశాల్ పనిచేస్తున్నాడు. ఈనెల 14న లేదా 15న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మురుగన్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అయితే తాను బీజేపీ పార్టీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నటుడు విశాల్ కొట్టిపారేసినట్లు తెలుస్తోంది. అది కేవలం ప్రచారం మాత్రమేనని తాను ఏ పార్టీలో చేరడం లేదని సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.