అందాల తార అనుష్క దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన
తరువాత వారిపై అనేక రూమర్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళు తోటి హీరోలతో కాస్త క్లోజ్ గా ఉన్నా..
సరే ఏదొక ఎఫైర్ ను అంటగడుతూ ఉంటారు. ఇలాంటి రూమర్స్ ను పట్టించుకొని కొందరు బాధ
పడితే మరికొందరు మాత్రం ఇలాంటివి కామన్ అని లైట్ తీసుకుంటుంటారు. ఇప్పుడు స్వీటీపై
కూడా అలాంటి రూమర్స్ వినిపిస్తున్నాయి. ఓ నిర్మాతతో ఆమె సన్నిహితంగా మెలుగుతోందని
మాటలు వినిపిస్తున్నాయి. వీటిపై అనుష్క పరోక్షంగా స్పందించింది. ఒకప్పుడు ఇలాంటి రూమర్స్
ను పట్టించుకొని బాధ పడిన మాట వాస్తవమే.. ఆ తరువాత నుండి మాత్రం లైట్ తీసుకోవడం
మొదలుపెట్టానని చెబుతోంది. అవతలి వాళ్ళు ఏం అనుకుంటారో.. నేను ఆలోచిస్తే నా మనఃశాంతి
పోతుంది. అవి పట్టించుకోకపోవడం వలనే నేను ఆనందంగా ఉన్నానని స్పష్టం చేసింది.