హైకోర్టు తీర్పు తర్వాత జేఏసీ నేతలు దీక్ష విరమించడం.. సడక్ బంద్, రాస్తారోకోలు వాయిదా వేయడం.. ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని సోమవారం ప్రకటించడంతో.. ఆర్టీసీ జేఏసీ సమ్మెపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఇవాళ సమావేశం కూడా సుదీర్ఘంగా జరిగింది.. కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ జేఏసీ సమావేశం ముగియగా… సమ్మె యథావిథిగా కొనసాగుతుందని ప్రకటించారు జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి.. జేఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కార్మికులు చెప్పారని స్పష్టం చేసిన ఆయన.. హైకోర్టు తీర్పు కాపీ ఇంకా తమకు అందలేదని.. కోర్టు తుది తీర్పు కాపీ అందే వరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు. కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.