HomeTelugu Big Storiesఏపీలో నిన్న ఒకరోజే 60 కోట్లు తాగేశారు.!

ఏపీలో నిన్న ఒకరోజే 60 కోట్లు తాగేశారు.!

2 4
కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో దేశం మొత్తం స్తంభించిపోయింది. 40 రోజుల తరువాత మద్యం షాపులు తెరుచుకోవడంతో.. ఏపీలో వైన్స్ షాపుల ముందు మందుబాబులతో కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు దర్శనమిచ్చాయి. భౌతికదూరం గాలికొదిలేసి ఒకర్నొకరు తోసుకుంటూ.. మాస్కులు, శానిటైజర్లు లాంటి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా మద్యం షాపుల దగ్గరకు గుంపులు గుంపులుగా తరలివచ్చారు. దీంతో.. తిరునాళ్లను తలపించాయి. కొన్నిచోట్ల మద్యం షాపులకు మందుబాబులు కొబ్బరికాయలు కొట్టి, హారతులు ఇచ్చారు. మరికొన్ని చోట్ల బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇక.. మందు బాటిల్‌ చేతిలో పడినవాళ్ల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.. ఒక్క బాటిల్ దొరికొతే చాలు అన్నట్టుగా మండుటెండను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి లైన్లలో నిలబడ్డారు.

బాటిల్ చేతిలో పడగనే ఎగిరిగంతేశారు. ఇక, పలుచోట్ల తొక్కిసలాటలు, తోపులాటలు జరగడంతో.. పోలీసులు లాఠీలకు పనిచెప్పి.. మందుబాబులను కంట్రోల్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. నిన్న ఒకే రోజు రికార్డు స్థాయిలో మద్యాన్ని తాగేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,468 మద్యం షాపులు ఉండగా.. 2,345 వైన్స్‌ షాపులను మాత్రమే అధికారులు తెరిచారు. ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు తెలుస్తోంది. సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా రోజూ రూ.65 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు మద్యం విక్రయాలు సాగిస్తారట.. అయితే, రాష్ట్రంలో రెడ్‌జోన్లు ఉండడంతో దాదాపు మూడో వంతు దుకాణాలు తెరుచోలేదు.. మరోవైపు మద్యం ధరలు కూడా పెరిగాయి.. దీంతో.. ఒకే రోజు రూ.60 కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలు జరిగాయని చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu