‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఎన్టీఆర్ రామ్ చరణ్ లపై ఫైట్ సీన్స్ కు సంబంధించిన సీన్స్ ను ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్ లో చిత్రీకరిస్తున్నారు. డిసెంబర్ 3 వరకు ఈ షూటింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3 షెడ్యూల్ ముగుస్తుంది. వచ్చే ఏడాదిలో సెకండ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తప్పించి క్యాస్టింగ్ ఎవరనే విషయం బయటకు రాలేదు. ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు అనేది ఇంకా చిత్రా యూనిట్ కన్ఫర్మ్ చేయడం లేదు.
హీరోయిన్లు ఎవరనే విషయాన్ని డిసెంబర్ 12వ తేదిన రాజమౌళి ప్రకటించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ ఇలా ఎన్నో పేర్లు తెరమీదకు వస్తున్నాయి. వీరినే సెలక్ట్ చేస్తున్నారో లేదంటే అందరికి సర్ఫ్రైజ్ చేస్తూ వేరే ఎవరినైనా అనౌన్స్ చేస్తారో చూడాలి.