దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి.. రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ . కాగా.. ఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ చిత్రీకరణను మొదలుపెట్టనున్నారట. ఇందుకోసం తారక్ గుజరాత్‌లోని వడోదర నగరానికి వెళుతున్నారు. ఈ విషయాన్ని తారక్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ.. విమాన టికెట్ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్ భారీ షెడ్యూల్.. నేను బయలుదేరుతున్నాను’ అని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ఈ ట్వీట్ పెట్టిన కొద్దిసేపటికే పదిహేను వేల మందికి పైగా లైక్స్ చేశారు. ‘హ్యాపీ జర్నీ అన్నా.. మాకు ఇలాగే ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ఉండు’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ చిత్రంలో తారక్.. కొమురం భీమ్ పాత్రలో, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు. చరణ్‌కు జోడీగా ఆలియా భట్, తారక్‌కు జోడీగా డైసీ అడ్గార్‌జోన్స్ నటించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తున్నారు. సినిమాను 2020 జులై 30న అన్ని భారతీయ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Off to a flying start!Big schedule ahead.#RRR pic.twitter.com/f82ksuIWR6
— Jr NTR (@tarak9999) March 28, 2019