మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రముఖ దర్శకుడు రాజమౌళితో కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా కోసం 10 నెలల డేట్స్ కేటాయించారు. దీంతో రాజమౌళి ఎలాంటి అవాంతరాలు లేకుండా షూటింగ్ ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఆ ప్లానింగ్ ఎలా ఉందంటే సినిమా అనుకున్నదానికంటే ముందుగానే పూర్తయ్యేలా ఉందట. మొదట 2020కి షూట్ ముగించాలని అనుకున్నారు జక్కన్న. కానీ చిత్రీకరణ జరుగుతున్న స్పీడ్ చూస్తుంటే అంతకంటే ముందే ముగుస్తుందని సమాచారం. పీరియాడిక్ డ్రామాగా ఉండబోతున్న ఈ సినిమాను దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాజమౌళి పెద్దన్న కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.