HomeTelugu Big Storiesఆర్‌ఆర్‌ఆర్‌: అంతర్జాతీయ అవార్డు అందుకున్న జక్కన్న

ఆర్‌ఆర్‌ఆర్‌: అంతర్జాతీయ అవార్డు అందుకున్న జక్కన్న

RRR movie won another prest

దర్శకధీరుడు రాజమౌళి తెరక్కెకించిన ప్రతిష్ఠత్మిక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో రామ్ చరణ్-ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. చరణ్‌ అల్లూరి సీతారామ రాజుగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసును బద్దలు కొట్టిన ఈ సినిమాకి అనేక అవార్డులు క్యూకడతున్నాయి. అంతర్జాతీయ అవార్డు వేదికలపై ‘ఆర్ఆర్ఆర్’ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది.

ఇప్పటికే పలు అవార్డులు బాక్సాఫీసు బరిలో కలెక్షన్ల రివార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా. అంతర్జాతీయ అవార్డులు అందుకుంటోంది. తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయస్ అవార్డుల్లో మరో అవార్డు అందుకుంది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ బాణాలు వేసే సన్నివేషం మరీ అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఈ స్టంట్స్ హాలీవుడ్ క్రిటిస్ ఛాయిస్ జ్యూరీకి కూడా నచ్చింది. అందుకే అవార్డు ఇచ్చింది.

అవార్డు అందుకున్న అనంతరం రాజమౌళి మాట్లాడుతూ.. తమ సినిమాలో స్టంట్స్ గుర్తించి అవార్డు ఇచ్చిన హెచ్ సీఏకు ధన్యవాదాలు తెలిపారు. తాను ముందుగా తమ యాక్షన్ కొరియోగ్రాఫర్లకు ధన్యవాదలు చెబుతున్నట్లు వివరించారు. స్టంట్స్ కంపోజ్ చేయడానికి సాల్మన్ చాలా ఎఫర్ట్స్ పెట్టాడని వివరించారు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్లులలో కొన్ని తీయడానికి రూబీ హెల్ప్ చేశారని జక్కన్న గుర్తు చేశారు. ఇతర స్టంట్ కొరియోగ్రాఫర్లు కూడా ఇండియా వచ్చి తమ విజన్ అర్థం చేసుకొని తమ వర్కింగ్ స్టైల్ అర్థం చేసుకొని పని చేశారని చెప్పుకొచ్చారు.

RRR1

నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ వచ్చింది. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి గేయ రచయిత చంద్రబోస్ లు సంయుక్తంగా.. గోల్డెన్ గ్లోబ్ వేదిక అవార్డును అందుకున్నారు. అంతేకాదు నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ కూడా వచ్చింది. మార్చి 13వ తేదీ 2023 న విజేత వివరాలు వెల్లడిస్తారు. ఇలా ఈ సినిమాకు ప్రత్యేక అవార్డులు వస్తుండడంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu