‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. అనుకున్న సమయానికే(అక్టోబర్ 13) ఆర్‌ఆర్‌ఆర్ సినిమాని విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. ధర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూన్నారు.
రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతేకాదు ఎన్టీఆర్, రామ్‌చరణ్ రెండు భాషలకు డబ్బింగ్ కూడా పూర్తిచేశారట. మిగిలిన భాషల్లో డబ్బింగ్ త్వరలోనే పూర్తి చేయబోతున్నట్లు పేర్కొంది. మరికొన్ని రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా చరణ్, ఎన్టీఆర్ బుల్లెట్‌పై వీధుల్లో చక్కర్లు కొడుతున్న కొత్త ఫొటోని అభిమానులతో పంచుకుంది.
Ramaraju & Bheem ❤️🔥🌊 #RRRMovie pic.twitter.com/5vrM662iGo
— RRR Movie (@RRRMovie) June 29, 2021