HomeTelugu Trendingచలిలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' వీడియో వైరల్‌

చలిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వీడియో వైరల్‌

RRR Movie Shoot in Midnightలాక్‌డౌన్‌ అనంతరం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ తిరిగి ఇటీవల అన్ని జాగ్రత్తలతో ప్రారంభమైంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. అలియాభట్‌, ఓలివియా మోరీస్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. విప్లవ వీరులు కొమురం భీం, అల్లూరి సీతారామరాజు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో కోమురం భీంగా ఎన్టీఆర్‌, సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించనున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక సెట్‌ వేసి మిగిలిన షూటింగ్‌ భాగాన్ని జరుపుకోంటుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని బీఏ రాజు తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘శీతాకాలం చలి పనులు ఆపలేదు’ అందరూ సెట్ లో ఏర్పాటు చేసిన హీటర్స్ దగ్గర చలి కాచుకుంటున్నారు. అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ వీడియోలో దర్శకుడు రాజమౌళితో, కెమెరామెన్‌ సింథిల్‌తోపాటు చిత్ర యూనిట్‌ కలిసి కరోనా నిబంధనలు మేరకు మాస్కులు దరించి చ‌లికి వ‌ణుకుతూ షూటింగ్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్‌కు రాజమౌళి షూట్‌ సీన్‌ను వివరిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu