టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్: రౌద్రం రణం రుధిరం’ మూవీ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేస్తూ, ఎన్టీఆర్ వాయిస్‌తో విడుదల చేసిన వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కతోన్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న రామ్‌చరణ్‌కు … కొమరంభీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఆలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్‌లుగా సందడి చేయనున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, హాలీవుడ్ నటీనటులు ఎలిసన్ డ్యూడీ, రేయ్ స్టీవ్‌సన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.