HomeTelugu Trending'రౌడీ బాయ్స్' ట్రైలర్‌ విడుదల చేయనున్న ఎన్టీఆర్‌

‘రౌడీ బాయ్స్’ ట్రైలర్‌ విడుదల చేయనున్న ఎన్టీఆర్‌

rowdy boys movie trailer on

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న సినిమాల్లో ‘రౌడీ బాయ్స్’ ఒకటి. ఈ సినిమాతో దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆశిష్ హీరోగా పరిచయమవుతున్నాడు. దిల్ రాజు – శిరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి హర్ష కానుగంటి దర్శకత్వం వహించాడు. కొంతకాలం క్రితమే పూర్తయిన ఈ సినిమా సరైన విడుదల తేదీ కోసం ఎదురు చేస్తోంది.

ఈ నేపథ్యంలో సంక్రాంతి బరి నుంచి పెద్ద సినిమాలు తప్పుకోవడంతో, చిన్న సినిమాలకి అవకాశం దొరికింది. అలా ‘రౌడీ బాయ్స్’ కూడా బరిలోకి దిగాడు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కానుంది .

ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆశిష్ జోడీగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమాతో ఆశిష్ హీరోగా మంచి మార్కులు సంపాదించుకుంటాడనే నమ్మకంతో దిల్ రాజు ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!