టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ, నటుడు రాజీయ్ కనకాల కుమారుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. కొత్త డైరెక్టర్ విజయ్ దర్శకత్వంలో జేబీ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రోషన్ హీరోగా తెరకెక్కుతున్న నూతన చిత్రం ప్రారంభమైంది. హైదరాబాదులోని ఓ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తన తనయుడు రోషన్ హీరోగా చేస్తుండడం పట్ల సంతోషంగా ఉందని రాజీవ్ కనకాల ఓ వీడియోలో పేర్కొన్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని, చిత్రబృందాన్ని ఆశీర్వదించాలని సూచించారు. గతంలో రోషన్ సహాయ నటుడిగా చేసిన సంగతి తెలిసిందే.