బిగ్ బాస్ సీజన్ 2 ముగుస్తున్న ఆఖరి వారంలో హౌస్ నుంచి రోల్ రైడా ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకుల మద్దతుతో బిగ్ బాస్ హౌస్‌లో ఎక్కువకాలం కొనసాగిన రోల్‌రైడా బయటకు వచ్చాక మీడియా ఇంటర్వ్యూల్లో బిజీ అయిపోయాడు. ముఖ్యంగా దీప్తి సునయనతో జరిగిన లవర్స్ టాస్క్, అమిత్, కౌశల్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
లవర్స్ టాస్క్ ఇచ్చినపుడు దీప్తి సునయనతో బాగా ప్లే చేశారనగా దానికి రోల్ రైడా స్పందిస్తూ అది వన్ సైడ్ లవ్ మాత్రమే అన్నారు. ఆ సమయంలో ఆమె వైపు నుండి లవ్ కనిపించలేదు అని తెలిపారు. లవర్స్ టాస్క్‌లో భాగంగా నేను లెటర్స్ రాయాలి. దానికి ఆమె రియాక్ట్ అవుతూ ఇట్స్ ఓకే బ్రో అనేది. అపుడు నేను వెంటనే రియాక్ట్ అవుతూ ‘బ్రో అనొద్దమ్మా… బ్రదర్ ఇన్ లా అనాలి’ అంటూ కవర్ చేశాను… అని రోల్ రైడా అన్నారు. లవర్స్ టాస్క్ల్‌లో భాగంగా బయటకు వెళ్లి సాంగ్ వేసుకోవాల్సి ఉంటుంది. రాత్రి పూట సునయనను లేపి బయటకు వెళదామని అడిగితే…. ఆమె మళ్లీ ‘ఇపుడు నాకు ఫీల్ రాదు బ్రో’ అనేసింది. అలా అనడం కూడా వన్ కైండ్ ఆఫ్ ఫన్. చూసే జనాలకు కూడా ఫన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ టాస్క్‌లో చివరకు నాది వన్ సైడ్ లవ్ అయిపోయింది. ఆ టాస్క్ చాలా సరదాగా సాగింది అన్నారు.
మీకు, అమిత్‌కు మంచి బాండింగ్ ఉంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కామెడీ టైమింగ్ సూపర్‌గా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య కూడా కౌశల్ చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాడు కదా అన్న ప్రశ్నకు రోల్ స్పందిస్తూ.. ఆ విషయంలో నాకు కూడా కోపం వచ్చింది. మనం ఫ్రెండ్స్ అయినపుడు మాట మాట అనుకుంటాం. అది మనం డిస్ట్రర్బ్ అవ్వనంత వరకు ఓకే. కౌశల్ వచ్చి మీరు అలా అనుకోవద్దు… నాకు బాధ అనిపించింది అంటే నాకు కోపం వచ్చింది.
నేను వాడిని ఒరేయ్ అంటా, బే అంటా.. ఇంకేదైనా అంటాను. అది అమిత్ తీసుకోకుంటే నువ్వు అలా ఎందుకన్నావ్ అని క్వశ్చన్ చేయవచ్చు. కానీ మా ఇద్దరికీ ఏ సమస్యా లేనప్పుడు మీరెందుకు అనవసరంగా కల్పించకుంటున్నారని వెంటనే అనడం జరిగిందని అన్నారు. స్నేహితులుగా మన ఇద్దరికీ ఇబ్బంది లేదు, మూడో వ్యక్తికి కూడా ప్రాబ్లం క్రియేట్ అవ్వడం లేదన్నపుడు మనం ఏం చేసినా ఓకే. ఈ విషయంలో మన ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉండాలి. కౌనీ కౌశల్ అలా అనడం తప్పు అనిపించి వెంటనే చెప్పేశాను అని రోల్ రైడా తెలిపారు.