ప్రముఖ కామెడీ షో.. జబర్దస్త్ అంటే నాగబాబు, రోజా అల్టిమేట్ కాంబో.. నాగబాబు నవ్వు.. రోజా అదిరిపోయే పంచ్ లతో ఆ షో ఒక రేంజ్ లో ఫేమస్ అయ్యింది. ఇక కొన్ని కారణాల వలన నాగబాబు షో నుంచి తప్పుకున్నా రోజా మాత్రం తనకు అచ్చి వచ్చిన జబర్దస్త్ వదలలేదు. ఒకపక్క ఎమ్మెల్యే గా బాధ్యతలు నిర్వర్తిస్తూన్నారు.
జబర్దస్త్ షోకి జడ్జీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న.. రోజా లేని జబర్దస్త్ ని ఉహించుకోలేం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం రోజా జబర్దస్త్ కి గుడ్‌బాయ్ చెప్పనుంది. రోజా ప్రస్తుతం వైఎస్సార్ సీపీ పార్టీ తరపున నగరి ఎమ్మెల్యే గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా జగన్ కేబినెట్ మంత్రుల లిస్ట్ లో రోజా పేరు కూడా ఉన్న విష్యం విదితమే. ఈరోజు రోజా మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక రోజా.. సినిమాలు, జబర్దస్త్, అన్నీ షూటింగ్‌లు స్వస్తీ చెప్పనున్నట్లు రోజా ప్రకటించారు.