నందమూరి బాలకృష్ణ తన వ్యాఖ్యలతో తరచు వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవలే ఆయన నటించిన చిత్రం ‘వీర సింహారెడ్డి’ సక్సెస్ మీట్ లో.. ఏఎన్ఆర్ ఎస్వీఆర్‌ల ను ఉద్దేశిస్తూ చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. నందమూరి వర్సెస్ అక్కినేని అంటూ టాలీవుడ్ లో రచ్చ మొదలైంది.
వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో… బాలయ్య మాట్లాడుతూ.. ‘అక్కినేని తొక్కినేని రంగారావు ఈ రంగారావు అంటూ వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఈ వ్యాఖ్యలపై అక్కినేని వారసు యంగ్ హీరోలు అఖిల్, నాగచైతన్య కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించిన సంగతి తెలిసిందే. మరోవైపు అక్కినేని అభిమానులు కూడా బాలకృష్ణపై మండిపడుతున్నారు. అక్కినేని కుటుంబానికి బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో మంత్రి రోజా కూడా స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావుపై బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదని అన్నారు. బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చాలా సందర్భాల్లో చేశారని విమర్శించారు. ఎన్టీఆర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో బాలయ్య ఆలోచించుకోవాలని అన్నారు. ఇప్పటి వరకు బాలకృష్ణ తాను చేసిన కామెంట్స్ పై బాలకృష్ణ కానీ బాలయ్య తరపునుంచి కానీ ఎలాంటి వివరణ రాలేదు. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.