HomeTelugu Newsఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా రోజా

ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా రోజా

1 13నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. దీనిపై నేడో రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. మంగళవారం ఆమెను, మంత్రి పదవులు దక్కని మరికొందరు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి తాడేపల్లిలోని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. వారందరికీ మంత్రి పదవులు ఇవ్వలేకపోవడానికి కారణాలను వివరిస్తూనే, వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించారని తెలిసింది. ఈ నేపథ్యంలో రోజాకు ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ పదవిని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తనను ఈ పదవిలో నియమించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ రోజా తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. అంతకు ముందు విలేకరులతో మాట్లాడుతూ… జగన్‌ పరిపాలన దేశం ఆదర్శంగా తీసుకునేలా ఉంటుందని అన్నారు.

* కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై పార్టీలో తీవ్రంగా చర్చసాగుతోంది. సెప్టెంబరు నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు విషయాన్ని కొలిక్కి తీసుకురావాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

* అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే నామినేటెడ్‌ పదవుల భర్తీ అంశాన్ని వైసీపీ అధినాయకత్వం కొలిక్కి తీసుకురానుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేరు ఖరారు చేశారు. మరోవైపు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించనున్నారు. కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అనంతపురం జిల్లాకు చెందిన ఒక నేత పేరును పరిశీలిస్తున్నారు.

5 ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు
* రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి మండళ్ల ఏర్పాటుకు వైసీపీ నిర్ణయంచింది. దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇలా ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ వర్గాల సమాచారం మేరకు మొత్తం అయిదు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఐదు మండళ్లు ఇవీ.. 1. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు 2. ఉభయగోదావరి జిల్లాలు 3. కృష్ణా,గుంటూరు 4. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు 5. కర్నూలు, అనంతపురం జిల్లాలు..

Recent Articles English

Gallery

Recent Articles Telugu