HomeTelugu Big Storiesరివ్యూ: రోగ్

రివ్యూ: రోగ్

నటీనటులు: ఇషాన్, మన్నారా చోప్రా, ఏంజెలా, అనూప్ సింగ్, సుబ్బరాజు తదితరులు..
ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ
మ్యూజిక్‌: సునీల్‌కశ్యప్‌
సినిమాటోగ్రఫీ: ముఖేష్‌.జి
నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి
దర్శకత్వం: పూరి జగన్నాథ్‌

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ హీరో ఇషాన్ ను పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ‘రోగ్’. హీరోలను ఇంట్రడ్యూస్ చేయడంలో పూరిది సెపరేట్ స్టయిల్.. అందుకే ఆయన దర్శకత్వంలో పని చేయడానికి చాలా మంది కొత్త హీరోలు ప్రయత్నిస్తూ ఉంటారు. మరి ఇషాన్ కు ఛాన్స్ ఇచ్చిన పూరి ఏ మేరకు తన కథతో ప్రేక్షకులను మెప్పించాడో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!

కథ:
ఇషాన్.. అంజలి(ఏంజెలా) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. తన కోసం జైలుకి కూడా వెళతాడు. కానీ అంజలి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. దీంతో ఇషాన్ కు అమ్మాయిల మీద విరక్తి కలుగుతుంది. అంజలి అనే పేరు వినిపిస్తేనే ఇషాన్ కు చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అయితే తనవల్ల నష్టపోయిన ఓ పోలీస్ కుటుంబానికి ఇషాన్ అండగా ఉండాలనుకుంటాడు. దానికి ఆ ఫ్యామిలీ అంగీకరించకపోయినా.. ఇషాన్ వారికి దగ్గరగా ఉంటూ సహాయం చేస్తూ ఉంటాడు. ఆ ఫ్యామిలీకి చెందిన అంజలి(మన్నారా చోప్రా)ఇషాన్ తమ ఫ్యామిలీకు చేస్తోన్న సహాయం తెలుసుకొని అతడిని ఇష్టపడుతుంది. అంజలిని ఓ సైకో(అనూప్ సింగ్) పెళ్లి చేసుకుంటానని వేధిస్తూ ఉంటాడు. మరి ఆ సైకో బారి నుండి అంజలిని ఇషాన్ కాపాడగలిగాడా..? ఇషాన్ లో మరోసారి ప్రేమ పుడుతుందా..? అనే అంశాలతో సినిమా నడుస్తుంది.

ప్లస్ పాయింట్స్:
ఇషాన్
మన్నారా చోప్రా
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:
కథ, కథనం
ఎడిటింగ్
సంగీతం
సెకండ్ హాఫ్, క్లైమాక్స్

విశ్లేషణ:
రోగ్ పక్కా పూరి ఫార్మాట్ లో ఉండే లవ్ స్టోరీ.. అదే ఒకటే ప్యాటర్న్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్తే సినిమా చూడాలనుకునే ప్రేక్షకుడికి విసుగు వస్తుంది. ఇకనైనా పూరి తన టిపికల్ ఫార్మాట్ ను వదిలేసి కొత్తగా ట్రై చేస్తే రిజల్ట్స్ బావుంటాయ్. ఓ లవ్ స్టోరీ, హీరోకి తగ్గ విలన్ వారిమధ్య గొడవ ఈ ఫార్ములాకు తన స్టయిల్ పంచ్ లు, డైలాగ్స్ ను జోడించి సినిమా తీశాడు. రొటీన్ కథ, కథనాలతో ఆడియన్స్ కు తలనొప్పి తెప్పించేశాడు. ఫస్ట్ హాఫ్ కాస్త ఎంటర్టైనింగ్ గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి పట్టు కోల్పోయింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్స్ సినిమాకు పెద్ద మైనస్. లాజిక్స్ అందని సన్నివేశాలు ఇలా మొత్తం కలిపి రోగ్ ని నాశనం చేసేశాయి.

ఇషాన్ కు మొదటి సినిమా అయినా బాగా నటించాడు. మన్నారాచోప్రా ఈ సినిమాలో చాలా అందంగా కనిపించింది. పాటల్లో కూడా తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఏంజెలా గ్లామర్ షోకు పరిమితమైంది. అనూప్ సింగ్ సైకో పాత్రలో బాగా సరిపోయాడు. తనపై ఓ పాటను చిత్రీకరించడం, స్టెప్పులు వేయించడం ఫన్నీగా అనిపించింది. అలీ కామెడీ ట్రాక్ అసహనానికి గురిచేస్తుంది. పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు వారి పాత్రల పరిధుల్లో ఓకే అనిపించారు.

సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంది. సంగీతం గానీ, ఎడిటింగ్ వర్క్ గానీ అసలు బాలేవు. సినిమా స్థాయిని తగ్గించేశాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. తక్కువ బడ్జెట్ లోనే సినిమాను పూర్తి చేశారు. మొత్తానికి పూరి డైలాగ్స్ ఇష్టపడే ఆడియన్స్ మాత్రం సినిమాను చూసే ప్రయత్నం చేయొచ్చు.
రేటింగ్: 2/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu