రాక్ స్టార్ దేవిను అభినందించే వేళ!
దేవిశ్రీప్రసాద్.. ఏ పేరంటే యూత్ లో విపరీతమైయన క్రేజ్. తన ఆట, పాటలతో ప్రేక్షకులను
ఆకట్టుకునే ఈ యంగ్ మ్యూజిషియన్ తనలోని సేవ భావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాడు. దేవి అంటే
స్టేజ్ మీద డాన్స్ చేయడం , చక్కటి మ్యూజిక్ తో అందరినీ అలరించడం మాత్రమే తెలుసు. కానీ
స్టేజ్ షోస్ ద్వారా వచ్చే డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు. అసలు విషయంలోకి
వస్తే దేవిశ్రీ ప్రసాద్ రీసెంట్ గా అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో మ్యూజిక్ షోస్ ను నిర్వహించాడు.
ఈ కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బుని దృష్టి, వినికిడి లోపం గల విధ్యార్ధుల సహాయార్ధం
వినియోగించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు. దేవి
ఇకపై ఇలాంటి మంచి పనులు మరిన్ని చేయాలని కోరుకుందాం!