రజినీకాంత్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘రోబో’ సినిమాకు సీక్వెల్ గా ‘రోబో2’
చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి విడుదల చేయడానికి
శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసం ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్ళిన రజినీకాంత్ సైతం తొందరగా
వచ్చేశారు. అయితే టెక్నికల్ గా ఈ సినిమాకు తలెత్తిన సమస్యల వలన షూటింగ్ ఆగిపోయినట్లు
తెలుస్తోంది. నిజానికి దర్శకుడు శంకర్ టైమ్ ఫ్రీజ్ టెక్నిక్ ను ఉపయోగించి షూటింగ్ నిర్వహించాలని
భావించాడు. అయితే దానికి సంబందించిన కెమెరా డిపార్ట్మెంట్ లో సాంకేతికంగా కొన్ని సమస్యలు
వచ్చాయని దాని కారణంగా షూటింగ్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఓ రెండు రోజుల్లో సమస్యను
పరిష్కరించి షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. ఈ సినిమాలో రజినీకాంత్ త్రిపాత్రాభినయం
చేయనున్నారనే వార్త ప్రచారంలో ఉంది.