HomeTelugu Trendingపెళ్లిపై విజయ్‌ దేరకొండ హీరోయిన్‌ కామెంట్స్‌..

పెళ్లిపై విజయ్‌ దేరకొండ హీరోయిన్‌ కామెంట్స్‌..

5 20

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీతూ వర్మ. తాజాగా తన పెళ్లి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు పెళ్లి చేసేయాలని తన త‌ల్లిదండ్రులు ఎంతో ఆస‌క్తితో ఉన్నారని… ఆమె మాత్రం ప్రేమ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది.

అయితే, తాను దీనిపై ఆలోచించుకోవడానికి కాస్త స‌మయం కావాల‌ని అడిగానని, తనకు నచ్చిన వ్య‌క్తి దొరికిన‌ప్పుడు తప్పకుండా చేసుకుంటానని చెప్పింది. తనకు లవ్ మ్యారేజ్ పైనే ఆస‌క్తి ఉందని వివరించింది. ఇక ఈ బ్యూటీ తొలుత షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. అనంతరం ‘బాద్‌ షా’ సినిమాతో సినిమా కెరీర్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ భామ ‘ట‌క్ జ‌గ‌దీశ్’ తో పాటు మరో రెండు సినిమాలతో బీజీగా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu