నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం శ్యామ్ సింగరాయ్ . నిహారిక టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ సెట్స్ లో మెజారిటీ షెడ్యూల్ ని చిత్రీకరించారు. ఇది సినిమాకే హైలైట్ గా ఉంటుందని సమాచారం. డిసెంబర్ 24 ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుండి ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమో ఆద్యంతం సింగరాయ్ ఎలివేషన్ పీక్స్ లో వర్కవుటైంది. నాని లుక్ గెటప్ ఆహార్యం ప్రతిదీ మారిపోయింది. ఒక కొత్త నానీని చూస్తున్నట్టే ఉంది. పక్క పాపిడి మెలి తిప్పిన రింగు మీసం మెలి వేయడం వగైరా వగైరా అతడి ని ప్రత్యేకంగా ఆవిష్కరిస్తున్నాయి. దారపు మగ్గం తిప్పుతున్న నాని ని చూస్తుంటే ఆ పాత్రలోని డెప్త్ వేరే లెవల్లో ఉంటుందని అర్థమవుతోంది.