HomeTelugu Trendingసినిమా వదిలేయడంపై రిచా స్పందన

సినిమా వదిలేయడంపై రిచా స్పందన

Richa gangopadhyay reveals
టాలీవుడ్‌లో ‘మిర్చి’, ‘లీడర్’ వంటి సినిమాలలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి రిచా గంగోపాధ్యాయ. ఆ తరువాత కూడా కొన్ని సినిమాల్లో నటించిన ఈమె కెరీర్ చక్కగా కొనసాగుతున్న టైమ్‌లోనే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి… అమెరికాకు వెళ్లిపోయింది. అమెరికా జాతీయుడిని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. సినీ కెరీర్ ను హఠాత్తుగా ఆపేయడంపై తాజాగా ఆమె స్పందించింది రిచా.

తనకు చదువంటే ఇష్టమని… మార్కెటింగ్ లో ఎంబీఏ చేయాలనేది తన చిన్ననాటి కల అని తెలిపింది ఈ బ్యూటీ. ఎంబీఏ చదివే అవకాశం రావడంతో అమెరికాకు వెళ్లిపోయానని చెప్పింది. తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని అనిపించిందని తెలిపింది. ఎంబీఏలో తన క్లాస్ మేట్ నే ప్రేమించి, పెళ్లి చేసుకున్నానని చెప్పింది. సినిమాలకు దూరమయ్యాననే బాధ తనలో లేదని… తన జీవితం ప్రస్తుతం సాఫీగా సాగుతోందని తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu