HomeTelugu Trendingమగబిడ్డకు జన్మనిచ్చిన రిచా గంగోపాధ్యాయ

మగబిడ్డకు జన్మనిచ్చిన రిచా గంగోపాధ్యాయ

Richa gangopadhyay blessed

నటి రిచా గంగోపాధ్యాయ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. మే 27న తనకు మగబిడ్డ పుట్టాడని తెలియజేస్తూ తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. బాబుకి ‘లుకా షాన్‌’ అనే పేరు పెట్టినట్లు ఆమె తెలిపారు. ‘మా చిరు సంతోషం!! లుకా షాన్‌. మే 27న జన్మించాడు. చిన్నారి రాకతో మేమంతా ఎంతో ఆనందంగా ఉన్నాం. లుకా ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, రూపురేఖల్లో అచ్చం తన నాన్నలాగానే ఉన్నాడు. లుకా.. నువ్వు మా జీవితాల్లో మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని నింపావు’ అని రిచా రాసుకొచ్చారు.

టాలీవుడ్‌ ‘లీడర్‌’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రిచా గంగోపాధ్యాయ్‌. ఆ తరువాత ‘నాగవల్లి’, ‘మిరపకాయ్‌’, ‘సారొచ్చారు’ వంటి చిత్రాల్లో నటించారు. ప్రభాస్‌ ‘మిర్చి’తో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2013లో ‘భాయ్‌’ సినిమా తర్వాత ఉన్నత విద్య కోసం ఆమె అమెరికా వెళ్లారు. అక్కడ బిజినెస్‌ స్కూల్‌లో జోను ప్రేమించారు. పెద్దల అంగీకారంతో ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమె నటనకు దూరమయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by Richa Langella (@richalangella)

Recent Articles English

Gallery

Recent Articles Telugu