బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ మాజీ లవర్ రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ కు సంబంధించిన విషయాలపై ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రియా సోదరుడు శోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. ఎన్సీబీ విచారణలో అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి. డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్టు రియా ఒప్పుకున్నది. షోవిక్, మిరాండాల ద్వారా డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్టు రియా అంగీకరించింది. సుశాంత్ కోసం డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్టు రియా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు మరింత లోతుగా ఈ కేసును విచారిస్తున్నారు. కాగా ఈ విచారణలో రియా పలువురు సినీ పెద్దల పేర్లు వెల్లడించినట్లు తెలుస్తుంది .
ఇక కేధార్ నాథ్ సినిమా షూటింగ్ సమయంలో సుశాంత్ తన కోస్టార్స్ తో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని రియా అధికారులకు వెల్లడించిందని తెలుస్తుంది. సుశాంత్ డ్రగ్స్ తీసుకుంటున్న విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడని. అవి అతని స్టాఫ్ మెంబర్స్ ద్వారా డ్రగ్స్ డెలివరీ అవుతుంటాయని రియా పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారిన విషయం తెలిసిందే.”మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీని సమర్థవంతంగా నాశనం చేయగలిగారు. నా కొడుకు అరెస్ట్ అయ్యాడు. ఇక తర్వాత అరెస్ట్ కాబోతున్నది నా కూతురు అనేది నాకు తెలుసు. కంగ్రాట్స్ ఇండియా… న్యాయం పేరుతో అన్యాయం చేస్తున్నారు. అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .