బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకు ఈ కేసు విషయంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ మీడియా ఛానళ్ల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, దర్శకనిర్మాత మహేష్ భట్ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ బయటకి వచ్చింది. దీనిని బట్టి సుశాంత్ చనిపోవడానికి ఆరు రోజుల ముందు జూన్ 8న రియా వాట్సాప్ చాటింగులో తన బాయ్ ఫ్రెండ్ సుశాంత్ ను విడిచిపెట్టినట్లు మహేష్ భట్ కు చెప్పినట్లు తెలుస్తోంది. రియా తండ్రికి సుశాంత్ పై సదభిప్రాయం లేదని.. అందుకే సుశాంత్ ను వదిలేయాలని మహేష్ భట్ రియాకు సలహా ఇచ్చాడని వాట్సాప్ ఛాట్ ద్వారా అర్థం అవుతోంది. ఈ ఛాటింగ్ ‘జలేబీ’ చిత్రంలో రియా చక్రవర్తి పోషిస్తున్న ఆయేషా పాత్ర పేరిట మహేష్ భట్ తో ఛాటింగు చేసినట్లు వెల్లడైంది. ‘జలేబీ’ చిత్రానికి మహేష్ భట్ – ముఖేష్ భట్ ప్రొడ్యూసర్స్ కావడం గమనార్హం. రియా – మహేష్ భట్ మధ్య జరిగిన వాట్పాప్ ఛాటింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.