వివాదస్ప దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మంగళవారం తన 58వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయనే శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియోను షేర్ చేశారు. జైలులాంటి గదిలో కూర్చుని కాళ్లు ఊపుతూ ‘హ్యాపీ బర్త్‌డే టూమీ..’ అంటూ పాడిన తీరు నవ్విస్తోంది. అంతేకాదు.. పుట్టినరోజున లాక్‌డౌన్‌లో ఒంటరిగా ఉండేలా చేసిన కరోనాకు ధన్యవాదాలు తెలిపారు. దయచేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి అని ట్వీట్ కూడా చేశారు. దీన్ని చూసిన ఫాలోవర్స్ వర్మ రూటే సెపరేట్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Thanks to Corona i am bringing in my tmrws birthday all alone in lockdown singing happy birthday song to myself 😢🙄😫please greet me to cheer me🙏 pic.twitter.com/znsfXVsZML
— Ram Gopal Varma (@RGVzoomin) April 6, 2020