వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ యొక్క ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, బాలక్రిష్ణ యొక్క ‘మహానాయకుడు’ చిత్రాలకు నడుమ పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై పలువురు కేసులు పెడుతూ విమర్శలు గుప్పిస్తుంటే వర్మ వారికి తనదైన స్టైల్లో కౌంటర్లు ఇస్తున్నాడు. తాజాగా ‘మహానాయకుడు’ సినిమాకు సంబంధించి చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన రానా యొక్క మేకింగ్ వీడియో విడుదలైంది.
దాని నుండి కొన్ని షాట్స్ తీసుకున్న వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద వస్తున్న వార్తలకు మీ స్పందన ఏమిటి సర్ అని చంద్రబాబు నాయుడును ఒక జర్నలిస్ట్ అడిగినట్టు దానికి చంద్రబాబు గెటప్లో ఉన్న రానా మీరేమన్నా సరే రియాక్ట్ కావొద్దు.. ఏమన్నా సరే అంటూ కోపంగా చెప్పే డైలాగ్ పెట్టి అదే చంద్రబాబుగారి సమాధానం అన్నట్టు వీడియో తయారుచేసి ట్విటర్‌లో వదిలాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. ఇకపోతే ‘మహానాయకుడు’ రేపే విడుదలవుతుండగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ కాలేదు.
CBN’s scared reaction on #LakshmisNTRtrailer pic.twitter.com/6gQOjmCE5Z
— Ram Gopal Varma (@RGVzoomin) February 21, 2019