సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌లో స్టిరీన్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి సమస్యలు తలెత్తి, పారిపోవడానికి కూడా వీల్లేక రోడ్ల మీదే పడిపోయారు. ఆ దృశ్యాలను చూసి వారి హృదయం ద్రవిస్తోంది. అయ్యో పాపం అంటున్నారు. అయితే, రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ గ్యాస్ లీక్ ఘటన, ఆ దృశ్యాలను ఏకంగా థ్రిల్లర్ సినిమాతో పోల్చాడు. గ్యాస్ లీక్ ఘటన తర్వాత వర్మ వరుసగా ట్వీట్లు చేశాడు. ‘వైరస్, గ్యాస్ తర్వాత ఇక మిగిలింది ఏలియన్స్ ఎటాక్ మాత్రమే’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. అయితే, ఆ తర్వాత చేసిన మరో ట్వీట్‌లో విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటనను థ్రిల్లర్ సినిమాతో పోల్చాడు. ‘లాక్ డౌన్ వల్ల సినిమా ఇండస్ట్రీ మూతపడడంతో దేవుడు రియల్ లైఫ్ థ్రిల్లర్ సినిమాను తీసే పనిలో పడ్డాడు.’ అంటూ వర్మ వివాదాస్పదంగా ట్వీట్ చేశాడు. ఈ ప్రపంచంలో కులం, మతం, ఆడ – మగ, చిన్న – పెద్ద తేడా లేకుండా అందర్నీ చంపేది ముగ్గురేనని, టెర్రరిస్టులు, వైరస్‌లు, దేవుడు అంటూ వర్మ మరో ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ ట్వీట్లు వైరల్‌గా మారాయి.
Since film industry is shut , God is busy making real life thriller movies.
— Ram Gopal Varma (@RGVzoomin) May 7, 2020
After the virus and now the gas attack, I think the only thing left is aliens attacking🙏🙏🙏
— Ram Gopal Varma (@RGVzoomin) May 7, 2020